తిరుపతి ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి..! 11 h ago
TG: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. నలుగురు పరిస్థితి విషమం, 40 మందికి గాయాలు అయ్యాయి. బాధితులకు తిరుపతి రుయాలో చికిత్స అందిస్తున్నారు.